డిసెంబర్ నుంచి సమ్మర్ వరకూ మెగాహీరోల సినిమాలతో సందడి
- November 03, 2017
టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ హీరోలు ఉన్నది మెగా ఫ్యామిలీ నుంచే. దీంతో వరుసగా వాళ్ళ సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళలో వాళ్ళకి కూడా రిలీజ్ డేట్స్ క్లాష్ అవుతూ ఉంటాయి. కానీ వచ్చే సమ్మర్ వరకు మన మెగా హీరోలు తమ సినిమాలు గ్యాప్ తీసుకుని మరి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు.
మెగా ఫ్యామిలీలో చిరంజీవితో కలిపి మొత్తం ఏడుగురు హీరోలున్నారు. దీంతో ఒక్కోసారి ఈ హీరోలకే తమసినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ వస్తుంది. కానీ గ్యాప్ ఇచ్చే రిలీజ్ చేస్తారు. చిరంజీవి మినహా మిగతా మెగా హీరోల రాబోయే సినిమాల్లోనే నెలకో సినిమా చొప్పున విడుదలకు ప్లాన్ చేసుకున్నారు.
ముందుగా డిసెంబర్ 1న సాయిధరమ్ తేజ్ తన కొత్త సినిమా జవాన్ తో వస్తున్నాడు. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో తేజూ పాత్ర హైలైట్ అంటున్నారు. ఇక డిసెంబర్ లో అల్లు శిరీష్ తన కొత్త సినిమాతో వస్తున్నాడు.
జనవరి నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అజ్ఞాతవాసి విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఫిబ్రవరిలో వరుణ్ తేజ్ వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న తొలిప్రేమ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది. ఇక మార్చి నెలలో రామ్ చరణ్ రంగస్థలం 1985తో వస్తున్నాడట. మార్చి 29న డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న రంగస్థలంపై ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఏప్రిల్ 27న అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ వక్కంతం వంశీ. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఫిబ్రవరి, మార్చిలోనే సాయిధరమ్ తేజ్, వినాయక్ కాంబినేషన్లో రూపొందే సినిమా కూడా వస్తోంది. సో...ఇలా 20 నుంచి నెల రోజుల గ్యాప్ తో, మెగా హీరోలంతా తమ సినిమాలను వచ్చే సమ్మర్ వరకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మెగా హీరోల సినిమాల రిలీజ్ తో ... టాలీవుడ్ లో సందడి నెలకొన్నది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







