రష్యా అధ్యక్ష పదవి బరిలోకి పోర్న్‌స్టార్
- November 04, 2017
రష్యా అధ్యక్ష పదవికి తాను పోటీ చేయనున్నట్లు రష్యన్ పోర్న్‌స్టార్ ఎలెనా బెర్కొవా ప్రకటించారు. ఇందుకు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ను ఆమె వేదికగా ఎంచుకున్నారు. రష్యాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రష్యా ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆమె పోటీ చేయనున్నారు.
నైరుతి రష్యాలోని ముర్మన్స్క్ ఎలెనా సొంత పట్టణం. తాను అధ్యక్ష పదవి చేపడితే ‘సెక్సువల్ హరాస్మెంట్’కు ఉరి శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని ఎలెనా పేర్కొన్నారు. హార్వీ విన్స్టన్ లాంటి వాళ్లను చూసిన తర్వాత తాను ఉరి శిక్షను విధించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న స్కర్ట్‌లపై నిషేధం విధిస్తానని కూడా ఆమె చెప్పారు.
విడాకులు తీసుకోవడం అసాధ్యమయ్యేలా నిబంధనలు సడలిస్తానని, పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. అధ్యక్ష పదవి ప్రచారంలో మహిళలు విరివిగా పాల్గొంటున్నారని, అందుకే తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







