పిల్లల పుస్తకాల అల్మారాలో ' పెద్దలకు మాత్రమే' నవల
- November 05, 2017
రియాద్ : సౌదీ అరేబియాలో ఓ మహిళా రచయిత రాసిన నవల వివాదాస్పదంగా మారింది. అశ్లీలత ఉందంటూ దానిని చదివినవారు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ నవలను ప్రభుత్వం రద్దు చేసి, కాపీలను వెనక్కి రప్పించింది.బద్రియా అల్ బిష్ర్ మహిళల హక్కుల ఉద్యమకారిణి. రచయితగా తన పుస్తకాలకు గతంలో చాలా అవార్డులు గెలుచుకున్నారు కూడా. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ నవల రాశారు. ‘‘ఓ యువతి కొందరు మహిళల కష్టాలను తెలుసుకునేందుకు చేసే ప్రయాణం.. అందులో ఆమెకు ఎదురైన అనుభవాలతో’’ ఆ నవల కథ ఉంది. అయితే అందులో కొంత భాగం శృంగార నేపథ్యంతో కూడుకుని ఉందంట. కొందరు పాఠశాలు విషయాన్ని వెలుగులోకి తేగా.. మత పెద్దలు మండిపడ్డారు. దీనికి తోడు పెద్దలకు మాత్రమే గా పరిగణించాల్సిన ఈ నవలను చిన్న పిల్లల గ్యాలెరీలో పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ పుస్తకాన్ని వెనక్కి రప్పించి, విచారణకు ఆదేశించారు. కాగా, ఈ విమర్శలపై స్పందించేందుకు బిష్ర్ అందుబాటులో లేరు. చట్టాలు చాలా కఠినంగా ఉండే సౌదీలో పుస్తకాలు, మాగ్జైన్, జర్నల్స్ కూడా సెన్సార్ అవుతుంటాయి. మరి ఈమె నవల సెన్సార్ చేసుకోకుండానే మార్కెట్లోకి వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







