మేము శత్రువులం కాము అంటున్న జీవిత రాజశేఖర్

- November 05, 2017 , by Maagulf
మేము శత్రువులం కాము అంటున్న జీవిత రాజశేఖర్

చిరంజీవి రాజశేఖర్ ల మధ్య ఒకప్పుడు విబేధాలుండేవి.. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిన సాగదు.. స్నేహితులు విడిపోవచ్చు.. శత్రువులు మిత్రులు కావచ్చు.. ఇదే రీతిన వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడి.. చిరు, రాజశేఖర్ దంపతుల మధ్య స్నేహ సంబంధాలు చిగురించాయి.. గతంలో రాజశేఖర్ చిరంజీవి సినిమాలో విలన్ గా అవకాశం వస్తే నటిస్తా అని కూడా ప్రకటించారు.. కాగా ఇటీవల రాజశేఖర్ నటించిన 'పిఎస్వి గరుడ వేగ' సినిమా రిలీజ్ కు ముందు ప్రీమియర్ షో చూడడానికి రమన్నామని చిరు ఇంటికి రాజశేఖర్ జీవిత లు వెళ్ళి ఆహ్వానించారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.. మళ్ళీ గతంలో జరిగిన గొడవలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వారిపై జీవిత స్పందించింది. మేము చిరంజీవిగారిని కలిసినప్పుడల్లా ప్రతి ఒక్కరూ దానిని ఒక ఇష్యూ గా ఎందుకు మారుస్తున్నారు.. నాకు అర్ధం కావడం లేదు.. ఇటీవల చాలా ఈవెంట్స్ లో మేము చిరంజీవి కలిశాము.. మా మధ్య ఎటువంటి శతృత్వం లేదు... ఎటువంటి విబేధాలు లేవు.. ఈ విషయం ను పెద్దదిగా చేసి రచ్చ చేయవద్దు.. గరుడ వేగ సినిమా ప్రీమియర్ షో కోసం సీఎం, మహేష్ బాబు ఇలా చాలా మంది సెలబ్రిటీలను కలిసి.. ఆహ్వానించాం.. అదే విధంగా చిరంజీవి గారిని ఆహ్వానించాం... అని జీవిత చెప్పారు.. కాగా ఈ ప్రీమియర్ షో జీవిత అన్న మరణంతో రద్దు అయ్యిన సంగతి విధితమే.. గరుడవేగ సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.. విమర్శకుల ప్రశంసలను అందుకొంటున్నది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com