రూ.100 కోట్ల తో తెలంగాణలో స్కైవిన్‌ యూనిట్‌

- November 06, 2017 , by Maagulf
రూ.100 కోట్ల తో తెలంగాణలో స్కైవిన్‌ యూనిట్‌

విపణిలోకి నాలుగు కొత్త మోడళ్లు 
వచ్చే ఏడాది నాటికి రూ.100 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో స్మార్ట్‌ఫోన్‌ పరిజ్ఞానంతో కూడిన మొబైళ్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు స్కైవిన్‌ కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవరు సాధించాలని కూడా లక్ష్యంగా సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ భీమినేని పెట్టుకున్నట్లు వివరించారు. స్కైవిన్‌ ఆదివారం విపణిలోకి 4 కొత్త ఫీచర్‌ ఫోన్ల ( ఐ-9, ఐ-8, ఐ-5, ఐ-1) ను ప్రవేశపెట్టింది. వీటిని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌ తదితరులు ఆవిష్కరించారు. సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని, వీటిని 40% క్యాష్‌బ్యాక్‌తో అందిస్తున్నామని సురేష్‌ భీమినేని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com