రస్ అల్ ఖైమాలో కారులో వ్యాపించిన మంటలు : ప్రాణనష్టం లేదు
- November 06, 2017
రస్ అల్ ఖైమా: ఒక కారులో అకస్మాత్తుగా ఏ స్పష్టమైన కారణం లేకుండా భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాస్ అల్ ఖైమాలోని జూఫర్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సివిల్ డిఫెన్స్అధికారులు తెలిపారు. కారులోకి మంటలు వ్యాపించగానే అత్యద్భుతమైన రీతిలో వాహనంలో నుంచి అందరు తప్పించుకున్నట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ లేదని నివేదించబడింది. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందగానే రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ పోలీసు, పారామెడిక్స్ మరియు రెస్క్యూ జట్లను పంపింది. అగ్నిమాపకదళ సిబ్బంది కారుని చుట్టుముట్టిన అగ్ని జ్వాలలను అదుపులోకి తెచ్చింది. అగ్ని వెనుక కారణాలు గుర్తించడానికి పరిశోధనలు జరిపి చట్టపరమైన చర్య తీసుకోవడం కోసం సంబంధిత అధికారులకు సూచించబడింది."
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







