పార్టీ సందడిలో 'పద్మావతి'

- November 06, 2017 , by Maagulf
పార్టీ సందడిలో 'పద్మావతి'

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఓ చారిత్రక ప్రధాన పాత్రలో నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఆమె చిత్తూరు యువరాణి, రాణి పద్మావతి పాత్రలో కనిపించనుంది.  డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ అక్టోబర్ 9న విడుదలై యూట్యూబ్ రికార్డులని తిరగరాసింది. 50 మిలియన్ల క్లబ్‌లోకి చేరింది. ఈ ఆనంద ఘడియల్ని తన తోటి నటీ నటులు, ఫ్రెండ్స్‌తో కలిసి షేర్ చేసుకోదలచింది దీపిక. ముంబైలోని దీపిక ఇంట్లోనే ఈ పార్టీని ఎరేంజ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి బాలీవుడ్ ప్రముఖులంతా తరలి వస్తున్నట్లు సమాచారం. ముందున్న అన్నింటా సెన్సేషన్ క్రియేట్చేస్తున్న పద్మావతి రిలీజ్ అయ్యాక బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్న షేక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com