అభిమానులకి చేరువగా కమల్ ఆప్
- November 06, 2017
రాజకీయ అరంగేట్రానికి తొలి అడుగుగా సినీ నటుడు కమల్ హాసన్ మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా మొబైల్ యాప్ను ప్రారంభిస్తున్నారు. అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఈ యాప్ను ప్రారంభిస్తున్నామని కమల్ వెల్లడించారు.తన రాజకీయ ప్రస్థానానికి మొబైల్ యాప్ నాంది పలుకుతుందని అన్నారు.
అభిమానులు తన వెన్నంటి నిలుస్తారనే నమ్మకం తనకుందని..గతంలో తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సహకరించినట్టే రాజకీయ ప్రయాణంలోనూ ఉదారంగా నిధులిస్తారని కమల్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నింటికీ మొబైల్ యాప్ కేంద్రంగా ఉంటుందని చెప్పారు.తాను స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచనని, అక్కడ మూలుగుతున్న ధనాన్ని వెనక్కిరప్పిస్తానని మంగళవారం 63వ బర్త్డే జరుపుకోనున్న కమల్ తెలిపారు.
రాజకీయాలపై తాను తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని, సినిమా పాత్రకు సంసిద్ధమయ్యేందుకే తాను మూడు నెలల సమయం తీసుకుంటానని చెప్పారు. హిందూ తీవ్రవాదంపై ఇటీవల కమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. తాను బెదిరింపులకు భయపడనని దీనిపై మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై జాతి వ్యతిరేక ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని, దేశంలో నెలకొన్న అతివాదంపైనే తాను మాట్లాడానని, ఉగ్రవాదానికి..అతివాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







