అమేజాన్‌ పార్శిల్‌లో సెల్‌ఫోన్‌కు బదులు బండరాయి

- November 07, 2017 , by Maagulf
అమేజాన్‌ పార్శిల్‌లో సెల్‌ఫోన్‌కు బదులు బండరాయి

మీరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తుంటారా? డిస్కౌంట్‌లో వస్తుందని సెల్‌ఫోన్‌ కొంటున్నారా? అయితే ఈ న్యూస్‌ మీ కోసమే. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఓ వ్యక్తి అమేజాన్‌లో మొబైల్‌ ఫోన్‌ కొన్నాడు. పార్శిల్‌ ఇంటికొస్తే ఆతృతగా ఓపెన్‌ చేశాడు. అయితే.. సెల్‌ఫోన్‌కు బదులు బండరాయి రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు.

ప్యాకేజ్‌ చూస్తే ఎలాంటి అనుమానం రాదు. కవర్‌, ప్లాస్టర్‌ అంతా కరెక్ట్‌గానే ఉందనిపిస్తుంది. కానీ.. లోపల ఏముందో మాత్రం తెలీదు. నరసరావుపేటకు చెందిన సాయి మొదట ఇలానే భ్రమ పడ్డాడు. అయితే.. ఎందుకైనా మంచిదని పార్శిల్‌ రాగానే దాన్ని ఓపెన్‌ చేయకుండా ఊపి చూశాడు. లోపలి వస్తువు ఊగుతుండటం.. కాస్త బరువుగా అనిపించడంతో అనుమానంతో ప్యాకేజ్‌ ఓపెన్‌ చేసేటప్పుడు మొబైల్‌లో వీడియా రికార్డ్‌ చేశాడు ఆ కస్టమర్‌. అమెజాన్‌ కొరియర్‌లో సెల్‌ఫోన్‌కు బదులు బండరాయి రావడంతో అవాక్కయ్యాడు. 

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఇలాంటి ఘటనలు పదే పదే రిపీట్‌ అవుతున్నాయి. ఒక వస్తువుకు బదులు మరో వస్తువు రావడం.. ఖాళీ పెట్టెలు, రాళ్లు రావడం ఈ మధ్య కామన్‌గా మారింది. డైరెక్ట్‌ కొరియర్స్‌లో కాకుండా థర్డ్‌ పార్టీ కొరియర్‌ సర్వీస్‌లోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇవాళ్టి నరసరావుపేట ఘటనలోనూ థార్డ్‌ పార్టీ కొరియర్‌ సర్వీస్‌లో వచ్చిన పార్శిల్‌లోనే ఛీటింగ్‌ జరిగింది. ఇలాంటి కేసులను కంపెనీ వాళ్లు సీరియస్‌గా తీసుకోకపోతే.. ఆన్‌లైన్‌ షాపింగ్‌పైనే తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com