మరోసారి జోడి కడుతున్న హిట్ పెయిర్
- November 07, 2017
ఫిదా చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే ఆసక్తి కి తెరపడింది. ఫిదా తర్వాత విజయ్ దేవరకొండ ,నితిన్ లతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ చివరకు లీడర్ హీరో రానా తో ఫిక్స్ అయ్యాడు. రానా మొదటి చిత్రం లీడర్ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా శేఖర్ కమ్ములనే. లీడర్ తర్వాత లీడర్ 2 వస్తుందని అప్పట్లో వార్తలు వినిపించాయి కానీ ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. కానీ ఇంత కాలానికి మళ్లీ రానా తో చేసే అవకాశం దక్కించుకున్నాడు శేఖర్.
రానా డేట్లు ఎప్పుడిస్తాడన్నదాన్ని బట్టి సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుస్తుంది. పూర్తి స్క్రిప్టు రెడీ కావడానికి కూడా రెండు మూడు నెలలు పట్టొచ్చని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో కూడా ఇంకా తేలలేదు. ప్రస్తుతం రానా సత్యశివ డైరెక్ట్ చేయబోతున్న పిరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. 1945 కాలంలో జరిగిన కథగా ఈ మూవీ ఉండబోతుందట. ఇందులో రానా సుభాష్ చంద్రబోస్ ఆర్మీ 'ఆజాద్ హింద్ ఫౌజ్' లో సైనికుడిగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







