నవంబర్ 9న "సువర్ణ సుందరి" టీజర్

- November 07, 2017 , by Maagulf
నవంబర్ 9న

గత కొంత కాలంగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల నిర్మాణం సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలొ కాస్త ఎక్కువగానే కన్పిస్తొంది. స్టార్ హీరో హీరోయిన్ లు కూడా రోటీన్ కి భిన్నంగా, తమ క్యారక్టరైజేషన్ కంటే కధ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బాలీవుడ్ లో పద్మావతి లాంటి భారీ బడ్జెట్ మొదలుకొని టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి వరకు కంటెంట్ కే ప్రాధాన్యత ఎక్కువుగా కన్పిస్తోంది
ఇప్పడదే కోవలో మరో చారిత్రాత్మక చిత్రం "సువర్ణ సుందరి " తెరకెక్కుతోంది. "చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుంది" అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఎవర్ గ్రీన్ హీరోయిన్ జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ఈ హిస్టారికల్ అడ్వెంచర్ తెరకెక్కుతోంది. పూర్ణకు కూతురుగా నటిస్తుండటంతో పాటు, గతానికి - భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద పాత్రను సరికొత్తగా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్. డిజైన్ చెయటం విశేషం. కేవలం కధ, కధనాలు నచ్చి ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపటంతో పాటు, డూప్ లేకుండా స్టంట్స్ ను చేసి జయప్రద సినిమా పై తన ప్యాషన్ ను మరోసారి అందరికి గుర్తుచేశారు. ఇక ఏ సినిమా కైనా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇంపార్టెంట్. బట్ క్వాలిటీ అంతకంటే ముఖ్యం. సువర్ణ సుందరి విషయంలో నిర్మాత లక్ష్మి ఎమ్.ఎల్. మాత్రం క్వాలిటీకే ఎక్కువ ప్రాదాన్యత ను ఇస్తున్నారు. కంటెంట్, కాస్టింగ్, లొకేషన్స్, టెక్నిషియన్స్ ఇలా ప్రతి అంశం లోనూ ప్రత్యేకత ఉండేలా సువర్ణసుందరిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా వస్తోన్న సువర్ణ సుందరి టీజర్ నవంబర్ 9నే  విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com