రిలీజ్‌కి రెడీ అవుతున్న కలర్స్ స్వాతి నటించిన 'లండన్ బాబులు'
- November 10, 2017
ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ లతో లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న బ్యానర్ మారుతి టాకీస్. ఈ బ్యానర్ నుంచి డైరెక్టర్ చిన్ని కృష్ణ తెరకెక్కించిన లండన్ బాబులు త్వరలో రిలీజ్ కాబోతుంది. తమిళంలో విజయ్ సేతుపతి, రితికా సింగ్ కలసి నటించిన "ఆండవన్ కట్టాలై" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో.. అంతే తొందరగా విడాకులు తీసుకోవడానికి కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో రక్షిత్ హీరోగా పరిచయమవుతున్నాడు. కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. స్వాతి మీడియాలో యాంకర్ గా సోసైటి పట్ల భాద్యత కలిగిన పాత్రలో నటించడం విశేషం. చివరి షూటింగ్ షెడ్యూల్‌లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ అల్రెడీ రిలీజై అకట్టుకుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







