సింగపూర్‌లో హైదరాబాద్ చెందిన ఓ నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ దారుణ హత్య
- November 10, 2017
హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ సింగపూర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపార లావాదేవీల కోసం వాసుదేవ్‌ను నిందితులు అక్కడికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తీరా సింగపూర్ వెళ్లాక అతన్ని ఓ గదిలో నిర్బంధించారు. 3 కోట్లు ఇస్తే తప్ప వదిలిపెట్టేది లేదని, అడిగింది ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వాసుదేవ్ బంధువులకు వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టారు. ఫోన్లు కూడా చేశారు. బంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. దీంతో కంగారు పడిన వాసుదేవ్ భార్య.. వారితో మాట్లాడింది. అంత పెద్ద మొత్తం తమ వద్ద లేదని, తన భర్తను వదిలిపెట్టాలని వేడుకుంది. వాసుదేవ్ సోదరుడు సైతం కిడ్నాప్ ముఠాతో మాట్లాడినా వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. అనుకున్న సమయానికి డబ్బు ఇవ్వలేదన్న కారణంతో వాసుదేవ్‌ను చంపేసి ఆ ముఠా పరారయ్యింది. కుషాయిగూడలో ఉంటున్న వాసుదేవ్ కుటుంబ సభ్యులు, ఇండియన్ ఎంబసీ ద్వారా మర్డర్ విషయం తెలుసుకుని షాక్‌కి గురయ్యారు. రెండ్రోజుల్లో డెడ్‌బాడీని హైదరాబాద్ తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సింగపూర్‌లో జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపింది. వాసుదేవ్ వెంట ఎవరెవరు అక్కడికి వెళ్లారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు తీసుకున్నారు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







