దేశ రాజధానిలో భారీ ట్రక్కులు,లారీలపై నిషేధం
- November 10, 2017
దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా ప్రమాదాలకు కారణమవుతున్న పొగమంచు, వాయు కాలుష్యంపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఢిల్లీ లో నష్ట నివారణ చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం సిధమవ్తుంది.
మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న పర్యావరణ శాఖ అంచనాలతో ఈ నెల 13 నుంచి 17 వరకూ సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు నిన్న రాష్ట్రప్రభుత్వం ప్రకటించినా విషయం తెలిసిందే. అయితే సీఎన్జీ వాహనాలకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీలో భారీ ట్రక్కులు, లారీలు వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమని వాటిని ఢిల్లీ పట్టణం లోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి వాటికి మినమాయింపులను ప్రభుత్వం కల్పించింది.
అప్పటికే ఢిల్లీ చెక్ పాయింట్ల దగ్గరకు చేరుకున్న ట్రక్కులను ఇతర నగరాలకు మళ్లిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పోలీసు శాఖ ఢిల్లీకి వచ్చే అన్ని రహదారుల్లోనూ చెక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 15 వరకూ ట్రక్కులపై నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







