నట కిరీటి పాక శాస్త్రంలో కూడా దిట్టే!
- November 10, 2017
హైదరాబాద్: ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌లో మంచి హాస్యనటుడే కాదు గొప్ప వంటవాడు కూడా ఉన్నారని అంటున్నారు నిర్మాత అనిల్ సుంకర. రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రాజుగాడు'. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే సెట్స్‌లోరాజేంద్రప్రసాద్ సరదాగా వంటచేశారట. ఈ విషయాన్ని అనిల్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్ చేశారు. 'రాజేంద్ర ప్రసాద్ సెట్‌లో ఉంటే నవ్వులకే కాదు భోజనానికి కూడా లోటు ఉండదు. రాజ్‌తరుణ్ ఆ ఫుడ్‌ను ఎలా దొంగిలించాలా అని ఆలోచిస్తున్నాడు' అని సరదాగా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు రాజ్‌తరుణ్ సమాధానమిస్తూ.. 'రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. ఆ ఫుడ్‌ను దొంగిలిద్దామనుకున్నాను కానీ, ఇంతలో వారే వండిపెట్టేశారు. చాలా రుచికరంగా ఉంది' అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంజన రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాజ్‌తరుణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి అమైరా దస్తర్ నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష