చైనాలో మందుబాబులకో బంపర్ ఆఫర్!
- November 10, 2017
చైనాలో మందుబాబులకు అక్కడి మద్యం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1675 డాలర్లు చెల్లిస్తే జీవితాంతం మద్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపింది. నవంబర్ 11న జరిగే షాపింగ్ ఫెస్టివల్లో 11,111 యువాన్లు(1675డాలర్లు) చెల్లించి ఈ ఆఫర్ పొందొచ్చని జియాంగ్ షియాబా అనే మద్యం తయారీ కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా వెబ్సైట్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సైట్లో ఉండే స్టోర్ కూపన్లు, డిస్కౌంట్లను వాడుకుంటే ఈ రేటు ఇంకా తగ్గే వీలుంది. ఈ ఆఫర్ 99 మంది లక్కీ కస్టమర్లకు మాత్రమే. ‘బైజియు’ మద్యాన్ని జీవితాంతం ప్రతీ నెల 12 బాక్సుల్లో లక్కీ కస్టమర్లకు అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ పొందిన ఐదేళ్లలోపు ఎవరైనా చనిపోతే కుటుంబంలోని ఒక వ్యక్తికి ఇదే ఆఫర్ను ఇస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







