ఇనాగ్రల్ ప్లాజాలోనే మెట్రోరైలు ప్రారంభం
- November 12, 2017
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్న మెట్రోరైలు ఇనాగ్రల్ ప్లాజా సిద్ధమవుతున్నది. మియాపూర్ డిపో వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాజా అత్యంత సుందరంగా, మెట్రోరైలు కారిడార్లను తలపించేలా డిజైన్ చేశారు. మూడు ఆర్చీలతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను ఆనుకొని దీనిని నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీ ఇక్కడే ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాజాను ఆవిష్కరించిన అనంతరం మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ప్రారంభ సన్నాహాల్లో భాగంగా ప్లాజా పనులను మెట్రోరైలు అధికారులు వేగవంతం చేశారు. ప్రారంభించబోయే రోజు ప్లాజా ప్రాంతంలో స్వాగత తోరణాలతోపాటు, మెట్రోరైలుకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాజాను 360 డిగ్రీల్లో గుండ్రంగా నిర్మించడంతోపాటు మధ్యలో నీటి కొలను, చుట్టుపక్కల పచ్చిక బయళ్లను అభివృద్ధి చేసి అందంగా తయారు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష