'రాజా చెయ్యి వేస్తే' సినిమా విలన్ గా తారక రత్న
- November 10, 2015
ప్రస్తుతం టాలీవుడ్ అందరికంటే బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్. దాదాపు పది సినిమాలు చేతిలో ఉన్న ఈ యంగ్ హీరో ఇటీవలే 'రాజా చెయ్యి వేస్తే' అనే సినిమా అంగీకరించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ ను కూడా సెట్ చేస్తున్నాడు రోహిత్. కొత్త దర్శకుడు ప్రదీప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా నందమూరి వారసుడిని ఎంపిక చేశారు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్న నటుడు తారక రత్న. గ్రాండ్ గా లాంచ్ అయినా, తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాతో విలన్ గా మారిన ఈ నందమూరి చిన్నోడు చాలాకాలం తర్వాత మరోసారి ప్రతినాయక నటిస్తున్నాడు. అది నారా రోహిత్ కు ప్రతినాయకుడిగా కావటంతో ఈ వార్త మరింత హాట్ టాపిక్ గా మారింది. వారాహి చలనచిత్ర బ్యానర్ పై సక్సెస్ ఫుల్ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రోహిత్ కెరీర్ లో గతంలో ఎన్నడూ చేయని విధంగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ప్రదీప్. వెండితెర మీద నారా వర్సెస్ నందమూరి ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







