'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా పై అవేధేన వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి
- November 13, 2017
ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితగాథపై తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ వీరగ్రంథం' రోజుకో వివాదానికి కారణమవుతోంది. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. అయితే దీనిపై ఎన్‌టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎన్‌టీఆర్ ఘాట్‌లో తీసి ఆ స్థలాన్ని అపవిత్రం చేశారని ఆమె అన్నారు. అందుకోసం మంగళవారం ఎన్‌టీఆర్ ఘాట్‌ని పాలతో శుద్ధి చేసి పూజలు చేస్తున్నా అని తెలిపారు. మాకు నచ్చిన.. ఇష్టం లేని సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం అని ఆమె స్పష్టం చేశారు. ఎవరి అనుమతి తీసుకుని సినిమా తీస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ సినిమా షూటింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా దర్శకుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా తీసి తీరుతానిన స్పష్టం చేశారు. ఎన్‌టీఆర్ ఆత్మ తనకు మద్దతుగా ఉందని ఆయన తెలిపారు. లక్ష్మీ పార్వతీ ఈ సినిమాను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష