పవన్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థ
- November 13, 2017
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. పవన్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి దిగనుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పవన్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ కార్యక్షేత్రంలోకి దూకుతాడని అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే వాస్తవానికి పవన్ మధ్యలో చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలతో పెట్టుకుంటే పవన్ 2019 ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టం. పవన్‌తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. పవన్ - కొరటాల శివ కాంబినేషన్‌ను సెట్ చేసేందుకు ఈ బ్యానర్ తీవ్రంగా కృషి చేస్తోంది. తమ బ్యానర్‌లో సినిమా చేస్తే పవన్‌కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని కూడా అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మైత్రీ మూవీస్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్‌తో ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలా ? లేదా రాజకీయ క్షేత్రంలోకి వెళ్లిపోవాలా ? అన్నది తేల్చుకోలేకపోతున్నాడట. తమ బ్యానర్‌లో సినిమా చేసేందుకు పవన్ ఒప్పుకుంటే పవన్ రెమ్యునరేషన్‌తో కలిపి రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పవన్‌కు ఇచ్చే రూ.40 కోట్లను కూడా ముందే ఇచ్చేందుకు కూడా మైత్రీ మూవీస్ వాళ్లు ఓకే చెప్పారట. మరి పవన్ ఈ డీల్‌కు ఓకే చెపితే సౌత్ ఇండియాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నవారిలో పవన్ రెండో ప్లేస్‌లో నిలిచి అరుదైన రికార్డు సొంతం చేసుకుంటాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష