2014,2015,2016 నంది అవార్డులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- November 14, 2017
2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. 2014 ఉత్తమ చిత్రంగా లెజెండ్... బెస్ట్ హీరోగా లెజెండ్‌కు బాలయ్య... హీరోయిన్గా గీతాంజలి మూవీకిగాను అంజలి... లెజెండ్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి శ్రీనులు ఎంపికయ్యారు. విలన్‌గా లెజెండ్‌కు జగపతిబాబుకు అవార్డుల వచ్చాయి.
2015కు సంబంధించి ఉత్తమ చిత్రంగా బాహుబలి... బెస్ట్ హీరోగా శ్రీమంతుడు సినిమాకు మహేష్‌బాబు... ఉత్తమ నటిగా అనుష్కకు సైజ్ జీరో మూవీకి అవార్డులు వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా బాహుబలి సినిమాకు కీరవాణికి నంది దక్కింది. 2016లో బెస్ట్ మూవీగా పెళ్లి చూపులు... ఉత్తమ నటుడిగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు అవార్డులు వచ్చాయి. బెస్ట్ హీరోయిన్గా పెళ్లి చూపులు ఫేమ్ నీతూ వర్మకు నంది దక్కింది.
ఎన్టీఆర్ జాతీయ అవార్డుల విషయానికొస్తే... 2014లో కమల్‌హాసన్... 2015లో కె రాఘవేంద్రరావు... 2016లో రజనీకాంత్లకు దక్కాయి. ఇక బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులు... 2014లో రాజమౌళి... 2015లో త్రివిక్రమ్... 2016లో బోయపాటి శ్రీనులకు ఇచ్చారు. రఘుపతి వెంకయ్య అవార్డులు... 2014లో కృష్ణంరాజు... 2016లో చిరంజీవికి వచ్చాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







