ఉక్కపోత భరించలేక పెట్టుకున్న ఫ్యాన్లు ఊపిరి తీసాయి
- November 14, 2017
థాయ్‌లాండ్‌లోని చయాఫూమ్ ప్రావిన్స్‌కు చెందిన సొబ్తావీ (44) తాంబాన్ ముయాంగ్లోని తల్లి (86)ని చూసేందుకు వెళ్లాడు. ఆ రాత్రి అమ్మదగ్గరే ఉండి ఉదయాన్నే వెళదామని అనుకున్నాడు. అక్కడ వేడి ఎక్కువగా ఉండడంతో మూడు ఫ్యాన్లు పెట్టుకుని నిద్ర పోయాడు. అంతే తెల్లారిపాటికి శవమయ్యాడు. కారణమేమంటే అక్కడ పగటి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి రాత్రి పూట దారుణంగా పడిపోతుంటాయి. విషయం తెలియని సొబ్తావీ మూడు ఫ్యాన్లు ఆన్ చేసుకుని నిద్ర పోయాడు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడం దానికి తోడు అతడు కింద పడుకోవడంతో శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. తెల్లవారాక ఇంకా నిద్రలేవడం లేదని తల్లి వచ్చి చూసేసరికి శరీరమంతా చల్లబడి పోయిఉంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు హైపోథెర్మియా (శరీరం బాగా చల్లబడిపోవడం) తో అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







