ఈ 40 రోజులు ఎంతో ఎంజాయ్ చేశా, థాంక్స్ టు ఆల్ - సమంత

- November 14, 2017 , by Maagulf
ఈ 40 రోజులు ఎంతో ఎంజాయ్ చేశా, థాంక్స్ టు ఆల్ - సమంత

హైదరాబాద్‌: తన వెడ్డింగ్‌ సీజన్‌ రెండు రోజుల క్రితం జరిగిన రిసెప్షన్‌తో ముగిసిందని కథానాయిక సమంత అన్నారు. ఆదివారం సమంత, చైతన్యల రిసెప్షన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వింధుకు సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో దిగిన కొన్ని ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అక్టోబరు 6న తన పెళ్లి జరిగినప్పటి నుంచి నిర్వహించిన వేడుకల గురించి ప్రస్తావించారు.
'చివరికి వెడ్డింగ్‌ సీజన్‌ పూర్తైంది. 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయి. ఈ అందమైన దుస్తులు ధరించి, చాలా ఎంజాయ్‌ చేశా' అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు లవ్‌ మై ఫ్యామిలీ, ఎప్పటికీ మీకు కృతజ్ఞురాలిని అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జత చేశారు.
సమంత ప్రస్తుతం 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ, సామ్‌ గతంలో కంటే చాలా విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క సమంత ప్రధాన పాత్రలో అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ 'మహానటి' తెరకెక్కుతోంది. దీంతోపాటు సమంత పలు తమిళ చిత్రాల్లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com