3 వారాలపాటు అబుదాబీ రోడ్‌ మూసివేత

- November 15, 2017 , by Maagulf
3 వారాలపాటు అబుదాబీ రోడ్‌ మూసివేత

అబుదాబీ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, మూడు వారాలపాటు క్యాపిటల్‌లోని ఓ స్ట్రీట్‌ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర మెయిన్‌టెనెన్స్‌ పనుల నిమిత్తం ఈ మూసివేత చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అల్‌ మినా కోర్నిచ్‌ రోడ్‌ నుంచి అల్‌ మినా వరకు ఉన్న స్ట్రీట్‌లో మెయిన్‌టెనెన్స్‌ వర్క్స్‌ చేపడుతున్నారు. ఫిష్‌ మార్కెట్‌ మీదుగా ఈ రోడ్డ వెళుతుంది. బుధవారం నుంచి మూడు వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మోటరిస్టులు ఈ విషయాన్ని గమనించి, ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలనీ, మెయిన్‌టెనెన్స్‌ జరుగుతున్న ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్‌ సిబ్బంది సలహాల్ని పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com