వీకెండ్‌ వెదర్‌: యూఏఈలో వర్షాలు పడొచ్చు

- November 15, 2017 , by Maagulf
వీకెండ్‌ వెదర్‌: యూఏఈలో వర్షాలు పడొచ్చు

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ అండ్‌ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్‌), యూఏఈలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి శనివారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హ్యుమిడిటీ పెరగడంతో మేఘాలు ఎక్కువగా కనిపిస్తాయనీ, ఆ కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్‌సిఎంఎస్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ రోజు యూఏలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ స్థాయిలోనే గాలులు వీచే అవకాశముంది. జైస్‌ మౌంటెయిన్‌ వద్ద 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా ఉండే అవకాశాలున్నాయి. అరేబియా గల్ఫ్‌ మోస్తరుగా ఉంటే, ఒమన్‌ సముద్రం మాత్రం రఫ్‌గా ఉండనుందని ఎన్‌సిఎంఎస్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com