యేసుక్రీస్తు ఫొటో తీసేసి జిన్ పింగ్ ఫొటో పెట్టుకోండి.. చైనా ఆదేశాలు
- November 15, 2017
చైనాలోని పేద క్రిస్టియన్ల కోసం కొత్త జీసస్ అవతరించాడు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇప్పుడు చైనాలోని క్రైస్తవులందరికీ జీసస్ అయిపోయాడు. జిన్ పింగ్ మీ దేవుడంటూ ప్రచారం చేస్తున్న చైనా ప్రభుత్వం.. మీ ఇళ్లలో ఉన్న జీసస్ ఫొటో తీసి జిన్ పింగ్ ఫొటోను పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు అందుతాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పేద క్రైస్తవుల ఇళ్లలో గోడలపై జీసస్ ఫొటోకు బదులు జిన్ పింగ్ ఫొటోలు వెలిశాయి.
ఆగ్నేయ చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. స్థానిక అధికారుల వారికి కొత్త అల్టిమేటం జారీ చేశారు. మిమ్మల్ని పేదరికం నుంచి, అనారోగ్యం నుంచి బయట పడేసేది, జీసస్ కాదని, దేశాధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రమేనని ప్రచారం మొదలుపెట్టారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మీ కష్టాలను దూరం చేస్తుంది కాబట్టి ఇక జిన్ పింగ్ మీ దేవుడంటూ స్థానికులకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. జీసస్ ఫొటోలు తీసి జిన్ పింగ్ ఫొటోను పెట్టుకోవాలని, ఆయన ఫొటోలు కూడా పంచుతున్నారు.
దేశంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న చైనీయుల్లో 10 శాతం మంది క్రిస్టియన్లే. యుగాన్ కంట్రీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా అకౌంట్ ఆధారాల ప్రకారం ఆ ప్రాంతంలోని గ్రామస్థులు తమ ఇష్ట ప్రకారం 600కు పైగా జీసస్ పోస్టర్లు తొలగించారని, వాటి బదులు జిన్ పింగ్ ఫొటోలు పెట్టారని వాషింగ్‌టన్ పోస్ట్ కథనం పేర్కొంది. 2020 కల్లా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి మెరుగైన జీవనం కల్పించాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా జిన్ పింగ్ చైనా క్రిస్టియన్లకు జీసస్ అయిపోయాడంటూ తెలిపింది.
దీంతో మొన్నటివరకూ జీసస్‌ను తమ రక్షకుడుగా భావించిన పల్లెల్లోని క్రిస్టియన్లు.. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల ప్రచారంతో జిన్ పింగ్‌నే తమ దేవుడుగా భావిస్తున్నారు. పార్టీ సాయంతో మాత్రమే పేదరికం నుంచి బయటపడగలమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇంట్లో ఉన్న జీసస్ ఫొటోలు తీసేసి.. అధికారులు పంచుతున్న జిన్ పింగ్ ఫొటోలకు పూజలు చేస్తున్నారు. ఇప్పటివరకూ వెయ్యికి పైగా అధ్యక్షుడి ఫొటోలను అధికారులు యుగాన్ కంట్రీలో పంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో కూడా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ







