లెబనాన్ ప్రధాని కేసు ఇంకా మిస్టరీనే
- November 15, 2017
బీరుట్: తమ దేశ ప్రధాని సాద్ అల్ హరిరీని సౌదీ అరేబియా నిర్బంధించిందని లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవౌన్ ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆ దేశానికి వెళ్లిన ప్రధాని 12 రోజులయినా తిరిగి రాలేదని చెప్పారు. ఇది తమ దేశాన్ని అక్రమించడం కిందికే వస్తుందని అన్నారు. సౌదీ వెళ్లిన హరిరీ తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఈ నెల నాలుగో తేదీన అక్కడే ప్రకటించారు. హరిరీ సౌదీ అరేబియా పౌరుడు కావడంతో పాటు, అక్కడే పెరిగారు. ఇటీవల సౌదీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై పలువురు రాజకుమారులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనను కూడా అదుపులోకి తీసుకొని ఉంటారన్న వదంతులు వ్యాపించాయి. దీనిని సౌదీ ప్రభుత్వం తిరస్కరించింది.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







