దారుణంగా హత్య చేయబడ్డ వల్లభనేని
- November 15, 2017
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటున చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు, విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావును కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాసరావు తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు నిందితులు. సనత్‌నగర్ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, శ్రీనివాసరావు హత్య ఎవరు చేశారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







