శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాలి బూడిదైన కారు
- November 17, 2017
కారు ఇంజన్లో షార్ట్ సర్కూట్. క్షణాల్లో మంటలు. చూస్తుండగానే కారు కాలి బూడిదైంది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన కారు ప్రమాదం కలకలం రేపింది. ఉదయం ఓ కుటుంబం ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా కారు ఇంజన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపేశాడు. ప్రయాణీకులను కిందకు దింపేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అంతా చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి కారు కాలి బూడిదైంది. ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందటంతో ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పేశారు. విమానాశ్రయం సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దే ఈ ప్రమాదం జరగడంతో కలకలం నెలకొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష