దైవదూషణ విషయంపై ఆన్లైన్ లో పోస్ట్ చేయడంపై భారతీయ వ్యక్తిపై విచారణ

- November 17, 2017 , by Maagulf
దైవదూషణ విషయంపై  ఆన్లైన్ లో  పోస్ట్ చేయడంపై భారతీయ వ్యక్తిపై  విచారణ

దుబాయ్: బతుకుతెరువు కోసం పరాయి దేశం వెళ్ళినపుడు అక్కడి ప్రజలను వారి మత విశ్వాసాలను గౌరవించాలి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ దేశ చట్టాల ప్రకారం శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 34 ఏళ్ల వయస్సు ఉన్నఓ భారతీయ వ్యక్తి ఫేస్ బుక్ లో ప్రవక్త ముహమ్మద్ (పి.బి.హెచ్.హెచ్) కు సంబంధించి  అవమానకరమైన వాఖ్యానాలు చేశాడు. దీంతో  మొదటి కోర్టులో విచారణను ఎదుర్కొన్నాడు.. ఇంటర్నెట్ ద్వారా మతపరమైన ధిక్కారాన్ని పాల్పడినట్లు ఆ వ్యక్తిపై నేరం ఆరోపించబడింది.ఖండించారు. నిందితుడు  పోస్ట్ యొక్క విషయం  మరియు అందులోని అర్థం గురించి తనకు తెలియదని వాదించాడు. ఈ  కేసు గత సెప్టెంబరు 30 వ తేదీన నమోదైంది..ప్రతివాది యొక్క పేస్ బుక్ ఖాతాలో ఒక భారతీయ వ్యక్తి అవమానకరమైన పోస్ట్ గురించి ఓ వ్యక్తి పిర్యాదు చేయడంతో  బుర్బా దుబాయ్ పోలీసు స్టేషన్ కు  నివేదించబడ్డాడు. ప్రతివాది ఫేస్బుక్లో  ప్రవక్త ముహమ్మద్ (పి.బి.హెచ్.హెచ్) కు సంబంధించి వ్యంగ్యంగా పోస్ట్ గురించి నేను నా సహచరుల నుండి విన్నాను, నా స్నేహితుడి ద్వారా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పోలీసులు నివేదించిన వ్యక్తి చెప్పారు. " ప్రవక్త ముహమ్మద్ (పి.బి.హెచ్.హెచ్) చిత్రం పక్కన అగౌరవంగా ఒక వాక్యం పోస్ట్ చేసాడని ఆరోపణలు వెలువడటంతో పోలీసులు ఆ భారతీయ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు దర్యాప్తు సమయంలో ఆ నిందితుడు తానె ఫోటోను ఫేస్బుక్ లో  పోస్ట్ చేశాడని ఒప్పుకున్నాడు. కానీ తానూ తన స్నేహితుని నుండి అందుకున్నాడు. తన అవమానకరమైన కంటెంట్ గురించి తెలియకుండా అతని ఖాతాను షేర్ చేసుకొన్నట్లు వాపోయాడు. కేసు ఫైల్ కు  సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు  నిందితుడు పోస్ట్ చేసిన వ్యంగ్యచిత్రం యొక్క ఒక కాపీని జతచేయబడింది. ఈ కేసు కి సంబంధించినవిచారణను నవంబరు 27 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com