నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- May 07, 2024
హైదరాబాద్: ఈరోజు సాయంత్రం హైదరాబాద్ కు ప్రధాని నరేంద్రమోడీ రానున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. ప్రధాని రాక కారణంగా హైదరాబాద్ లోని వివిధ రోడ్డు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని, ఈ ఆంక్షలు మంగళవారం రాత్రి 7.50 గంటలనుంచి రాత్రి 8.25 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
తిరిగి ప్రధాని మోడీ రాజ్ భవన్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే క్రమంలో బుధవారం ఉదయం 8.35 గంటల నుంచి ఉదయం 9.10 వరకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇంకా వివిధ మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
మే 7న ట్రాఫిక్ ఆంక్షలు ఉండే రూట్లు… (రాత్రి 7.50 నుంచి రాత్రి 8.25 గంటల వరకు) బేగంపేట ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్, పీఎన్ టీ ఫ్లైఓవర్ కింద రైట్ టర్న్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ లాండ్స్, లెఫ్ట్ టర్న్, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోదా హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్ భవన్.
మే 8న ట్రాఫిక్ ఆంక్షలు ఉండే రూట్లు… (ఉదయం 8.35 గంటల నుంచి ఉదయం 9.10 గంటల వరకు) రాజ్ భవన్, ఎంఎంటీఎస్, యశోదా హాస్పిటల్, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, రైట్ టర్న్ ప్రగతి భవన్, బేగంపేట ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్స్ స్టాప్, పీఎన్ టీ ఫ్లైఓవర్ కింద, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్ లెఫ్ట్ టర్న్, బేగంపేట ఎయిర్ పోర్ట్.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







