ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్.!
- November 18, 2017
ముచ్చట్లు, పోస్టులు, షేర్లు, వీడియోలు... ఇన్నాళ్లూ ఫేస్‌బుక్ అంటే ఇవే. త్వరలో ఫేస్‌బుక్‌లో సెకండ్ హ్యాండ్‌వస్తువులు కొనేయొచ్చు, అమ్మేయొచ్చు. ఇదేంటి ఫేస్‌బుక్ ఏమన్నా ఓఎల్‌ఎక్సా లేకపోతే క్వికర్ ఆ.. అంటారా. అవును మీరన్నది నిజమే. ఎఫ్‌బీ త్వరలో అలాంటి సేవలు కూడా అందిచబోతోంది. మార్కెట ప్లేస్ పేరుతో త్వరలో ఫేస్‌బుక్ నుంచి సెల్/బై ఆప్షన్ రాబోతోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్ సహా 25 దేశాల్లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇటీవల ముంబయిలో ప్రయోగాత్మకంగా ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. త్వరలో అందరూ ఈ ఆప్షన్‌ను వాడుకోవచ్చు. ఈ ఆప్షన్ ఓఎల్‌ఎక్స్, క్వికర్ తరహాలోనే పని చేస్తుంది. ఫేస్‌బుక్ పేజీలో మార్కెట్ ప్లేస్ అని ఓ ట్యాబ్ వస్తుంది. అందులోకి వెళ్లి అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్ లేదా కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను వాడుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష