'అభిమన్యుడు' ఫస్ట్‌లుక్‌.!

- November 18, 2017 , by Maagulf
'అభిమన్యుడు' ఫస్ట్‌లుక్‌.!

'డిటెక్టివ్‌' చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు విశాల్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'అభిమన్యుడు'. సమంత కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని 'ఇరుంబు తిరై' టైటిల్‌తో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. చాలా ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. వివిధ ఆకారాల్లో ఉన్న స్క్రీన్లపై విశాల్‌ ముఖాన్ని చూపించారు. దీన్ని చూస్తూ ఓ వ్యక్తి అటువైపు నిల్చుని ఉన్నారు. వెనుకవైపు నుంచి చూస్తుంటే ఆయన అర్జున్‌లా కనిపిస్తున్నారు. పి.యస్‌. మిత్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. జార్జ్‌. విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. రూబెన్‌ ఎడిటింగ్‌ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాల్‌ 'డిటెక్టివ్‌' చిత్రం ఓ నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ. ప్రసన్న, ఆండ్రియా, అను ఇమ్మాన్యుయెల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మిస్కిన్‌ దర్శకత్వం వహించారు. విశాల్‌ నిర్మాతగా వ్యవహరించారు. తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com