అఫ్ఘాన్: ఆరుగురు పోలీసులు మృతి, 8మందికి గాయాలు
- November 20, 2017
కాబుల్: అఫ్ఘనిస్థాన్‌లోని పోలీసుల తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ అధికార ప్రతినిధి బషీర్ ఫరాV్‌ా తెలిపిన వివరాల ప్రకారం...కుంద్ ఫ్రావిన్స్‌లోని పోలీస్ తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు తాలిబన్లు చనిపోయారు. ఘటనాస్థలం నుంచి పరారైన తాలిబన్ల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా,అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా బలగాలు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.ఈనెల 14న కాందహార్‌లోని 12 చెక్‌పోస్ట్‌లపై తాలిబన్లు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 22 మంది పోలీసులు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







