న్యూ కెలడోనియాలో భూకంపం, సునామి హెచ్చరికలు జారీ!
- November 20, 2017
న్యూ కెలడోనియా: న్యూకెలడోనియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు అయినట్లు సమాచారం.దీంతో పాటు సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడ సముద్రంలోని అలలు ఐదడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సునామీ వల్ల 300 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూ కెలడోనియాలో తూర్పు తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ రాజధాని నౌమియో ఉంది. న్యూ కెలడోనియాలో ఆదివారం అర్థ రాత్రి నుంచి పలుమార్లు భూమి కంపించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







