చైనా ఆర్మీ వినూత్న ప్రయోగం
- November 20, 2017
బీజింగ్: చైనా ఆర్మీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఆన్లైన్లో సైనిక సమాచారం బహిర్గతం కాకుండా నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. ఈమేరకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిం చింది. సైనిక సమాచారాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారి వివరాలను సైతం ఇట్టే కనిపెట్టగల సాంకేతిక పరిజ్ఞానం తాము రూపొందించిన వెబ్సైట్లో ఉందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా చైనా సైన్యాన్ని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు పీపుల్స్ ఆర్మీ పేర్కొన్నది. చైనా సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సైన్యానికి సంబంధించి తప్పుడు వార్తలు పోస్ట్ చేసిన వారి వివరాలను ఈసైట్ ద్వారా గుర్తించవచ్చునని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో చైనా ఆర్మీకి సంబంధించిన వివరాలను ఎవరైనా పోస్ట్ చేసినట్టయితే ఈవెబ్‌సైట్ ద్వారా కనిపెట్టేం దుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించే క్రమంలో భాగంగా విప్ల వాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్టు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన 19వ సదస్సులో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించిన సంగతి తెలిసిం దే. సైబర్ దాడులను తిప్పిగొట్టగల సామర్ధ్యం, అధు నాత యంత్రాంగం తమ సైన్యంలో ఉందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







