జూ.ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన రేణు దేశాయ్

- November 20, 2017 , by Maagulf
జూ.ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన రేణు దేశాయ్

మెగా హీరోలు.. నందమూరి హీరోల మధ్య పోటీ ఉన్నా లేకున్నా... అభిమానుల మధ్య పోటీనేలకొన్నది. రెండు వర్గాల అభిమానుల మధ్య అంతరాలు ఉన్న సంగతి తెలిసిందే..!! ఈ నేపధ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు.. నందమూరి ఫ్యామిలీ హీరోలను పొగిడితే అది ప్రముఖ వార్తగా మారుతుంది. తాజాగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నోటి నుంచి నందమూరి ఫ్యామిలీ హీరో జూ.ఎన్టీఆర్ గురించి వచ్చిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రేణు మాటీవీలో ప్రసారం అవుతున్న నీతోనే డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి విధితమే.. ఈ షోలో ఒక జంట ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ నేపద్యంలో రేణు ఎన్టీఆర్ పై ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అని.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ డ్యాన్సర్ లో ఒకరు ఎన్టీఆర్ అని.. ఎంత కష్టమైన స్టెప్స్ అయినా ఎన్టీఆర్ చేస్తుంటే.. ఈజీగా అందంగా అనిపిస్తాయని అదే ఎన్టీఆర్ స్పెషాలిటీ అని రేణు కితాబు ఇచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్టీఆర్ బెస్ట్ అని రేణు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. రేణు వ్యాఖ్యలు విన్న తర్వాత నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com