ఆ విషయం చెప్పింది నేనే..: లక్ష్మీపార్వతి
- November 21, 2017
హైదరాబాద్: తన ఇంటి పక్కన వైన్‌షాప్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. లక్ష్మీపార్వతి నివాసానికి దగ్గర్లో వైన్‌షాప్ ఏర్పాటుచేయాలని నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. విషయం తెలుసుకున్న లక్ష్మీపార్వతి ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇదే విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆవిడ.. వైన్‌షాప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదుచేశానని చెప్పారు. కాదని వైన్‌షాప్ ఏర్పాటు చేస్తే ధర్నా చేస్తానని హెచ్చరించారు. అప్పట్లో మద్యపానం నిషేధించాలని స్వర్గీయ ఎన్టీఆర్‌కు చెప్పింది తానేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ మార్చుకోవాలని హితవుచెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష