యు. ఏ. ఈ. లో ‘తెలుగు పాఠ శాల’ప్రారంభోత్సవానికి ఆహ్వానం
- November 12, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తెలుగు వెలుగును వికసింప చేయడానికి శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారి కృషి ఫలితమైన ‘తెలుగు పాఠ శాల’ నవంబరు 14 నుండి ప్రారంభం కానుంది. నాలుగు లేదా ఆపై సంవత్సరాల వయసుగల చిన్నారులు ఇందులో చేరడానికి అర్హులు. ఈ కోర్సు పూర్తి అయిన తరువాత జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయిన ఆరు సంవత్సరాల వయసు గల చిన్నారులకు పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి నుండి ప్రమాణ పత్రం లభిస్తుంది. యు. ఏ. ఈ. అంతటా ఉన్న వీరి సెంటర్లలో, నెలకు రెండు తరగతులు జరుగుతాయి. మొదటగా సంస్థలో ఎన్ రోల్ చేసుకున్న 100 మంది చిన్నారులకు శిక్షణ ఉచితమని, ఆ తరువాతి వారికి సంవత్సరానికి 100 యు. ఏ. ఈ. డాలర్ల రుసుము ఉంటుందని శ్రీమతి అనురాధ తెలిపారు. సంస్థ ప్రారంభోత్సవానికి అందరు ఆహ్వానితులేనని, అంతే కాకుండా, ఆయా ప్రాంతాలలో బోధించడానికి, సమన్వయము చేయడానికి ఆసక్తి గల వారు తమను సంప్రదించాలని ఆమె కోరారు. మరి, మన చిన్నారులకు మన మాతృ భాషనూ నేర్పించడానికి మనం మన వంతు సహకారం అందించడమే ఆలస్యం!ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ కౌన్సెల్ జనరల్ అనురాగ్ భూషణ్ గారు ,నేపాలీ ఎమ్బస్సడర్ ధనుంజయ్ జా గారు,ICWA కన్వీనర్ శ్రీ.కుమార్ గారు విచ్చేయనున్నారు.‘తెలుగు పాఠశాల’ కు సహాయ సహకారాలు అందించిన శ్రీ అజిత్ కుమార్ గారికి,శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
‘తెలుగు పాఠశాల’ విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాము.మాగల్ఫ్.కామ్ తరపున శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారికి ప్రత్యేక అభినందనలు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







