అనారోగ్యానికి కారణమయ్యే ఆహారాలు
- November 12, 2015
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే.. తీసుకునే ప్రతి ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్త వహిస్తాం. ఆరోగ్యానికి మంచిదనే భావించే ఫుడ్ ని మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని ఆహార పదార్థాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని కొన్నిసార్లు గ్రహిస్తాం.. మరికొన్నిసార్లు గ్రహించలేకపోతాం. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరం ఈ పోషక ఆహారాలు.. ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వు పదార్థాలు.. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్నిస్తే.. మరికొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కారణమౌతాయి. కానీ అవగాహన లేని వాటిని తినేస్తూ ఉంటాం. అనారోగ్యానికి కారణమయ్యే ఆహారాలేంటో ఓ సారి చూద్దాం. బంగాళదుంపలు: బంగాళదుంపలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారం. వీటితో రకరకాల ఫ్లేవర్స్ లో వండుకోవచ్చు. తయారు చేయడం కూడా ఈజీనే కావడంతో ఎక్కువగా వీటిని తీసుకుంటూ ఉంటాం. అయితే బంగాళదుంపలను తరచుగా తినడం వల్ల బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి వీటిని అవైడ్ చేయడం మంచిది. పాలు: పాలు అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థమే అయినా.. ప్రతి రోజూ తీసుకునే పాలు పెరుగుదలకు అడ్డుపడుతుంది. నిద్రించే ముందు, బ్రేక్ ఫాస్ట్ రూపంలో, ఈవెనింగ్ స్నాక్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఎంపిక చేసుకునే ముందు ఒకసారి ఫ్యాట్ కంటెంట్ ని సరిచూసుకోవాలి. తక్కువ మోతాదులో వీటిని తీసుకుంటే మంచిది. డిజర్ట్: భోజనం చేశామంటే డిజర్ట్ కంపల్సరీ అయిపోయింది. భోజనం తర్వాత కొంతమందికి స్వీట్ తినడం అలవాటుగా మారింటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు స్వీట్స్ తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డిజర్ట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. స్నాక్స్: ఈవెనింగ్ స్నాక్స్ తినడం అందరికీ అలవాటే. కానీ అవి ఎంతవరకు ఆరోగ్యానికి మంచిదనేది ఒకసారి గమనించుకోవాలి. ఆకలిగా ఉందని ఏది పడితే అది తింటే.. ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి సాండ్విచ్, సమోసాలకు బదులు.. నట్స్, ఫ్రూట్స్ వంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









