హ్యాపీ బర్త్ డే చైతన్య
- November 22, 2017
ఏం మాయ చేసిందో నాగ చైతన్య మనసుకు దగ్గరయింది సమంత. మూడుముళ్లతో ఒక్కటయ్యారు. పెళ్లయిన తరువాత చైతూ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో కొంత స్పెషల్ అనే చెప్పాలి. పెళ్లి కూడా ఓ హాలిడే ట్రిప్‌లా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎంచక్కా ఎవరి డ్యూటీలో వారు జాయిన్ అయిపోయారు. సిన్సియర్‌గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం డేట్స్ ఇచ్చి వారు చేస్తున్న చిత్రాలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటున్నారు. ఇక ఈ రోజు చైతు బర్త్‌డే సందర్భంగా అభినందనల వెల్లువ మొదలైంది. అఖిల్, చైతు అన్నదమ్ములే అయినా మంచి ప్రెండ్స్‌లా ఉంటారు. అందుకే సమ్‌థింగ్ స్పెషల్‌గా అన్నయ్యకు 'ప్రపంచంలోనే నాకు ఇష్టమైన వ్యకికి శుభాకాంక్షలు... లవ్యూ మై బ్రదర్... ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి' అంటూ శుభాకాంక్షలు పంపించాడు అఖిల్ అక్కినేని. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి' అంటూ రకుల్, 'లిటిల్ కజిన్‌కి శుభాకాంక్షలంటూ' రానా, ఇలా చాలా మందే చైతూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మరి సమంత తన ప్రియ సఖుడికి ఏ విధంగా శుభాకాంక్షలు అందజేసిందో.. సరే.. మనం కూడా చైతూకి బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం. మరిన్ని మంచి చిత్రాలు అందించాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







