పదవ తరగతి అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు

- November 23, 2017 , by Maagulf
పదవ తరగతి అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ఆర్‌బీఐ శాఖలలో ఖాళీగా ఉన్న 500 ల ఆఫీస్ అటెండెంట్ పోస్టులని భర్తీ చేసేందుకు రిజర్వు బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యధిక పోస్టులు 165 ముంబై ఆర్‌బీఐ శాఖలో ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో 27 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ అటెండెంట్‌గా విధుల్లో చేరిన వారు ప్రమోషన్లు, సీనియారిటీ ప్రాతిపదికగా సీనియర్ ఆఫీస్ అటెండెంట్‌గా గుర్తింపు వస్తుంది. 

అర్హత: పదవ తరగతి / మెట్రిక్యులేషన్
వయసు: 01.11.2017 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 సం.లోపు ఉండాలి. (02.11.1992 నుంచి 01.11.1999 మధ్య జన్మించిన వారు అర్హులు)
ఆన్‌లైన్ రాతపరీక్ష: డిసెంబరు 2017/జనవరి 2018
దరఖాస్తు ఆఖరు తేదీ: 07.12.2017
పరీక్ష విధానం : ఆన్‌లైన్ ద్వారా
మరిన్ని వివరాలకు: www.rbi.org.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com