ఆరు కిలోల నకిలీ బంగారు కళాకృతులను స్వాధీనం చేసుకొన్న మంత్రిత్వ శాఖ
- November 23, 2017
కువైట్ : ' మెరిసేదంతా..బంగారం కాదనేది మన పెద్దల మాట ' నకిలీ బంగారు వస్తువులను అసలు సిసలు బంగారమని కొందరు వ్యాపారస్తులు వినియోగదారులను నమ్మబలికి మోసం చేస్తున్నారు. అల్-ముబారకీయ, అల్-రాయ్ తదితర వివిధ ప్రాంతాలలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఆరు కిలోగ్రాముల బరువున్న నకిలీ బంగారు కళాకృతులను వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకొంది. 80,000 కువైట్ దినార్ల (సుమారు 261,000 డాలర్లు) విలువ గల వీటిని స్వాధీనం చేసుకుంది. అపరాధులను ప్రాసిక్యూషన్ ఎదుటకు పిలవబడ్డారు.అక్రమదారుల నుండి స్వాధీనం చేసుకున్న ఆ నకిలీ బంగారు కళాకృతులు అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్లని అనుకరిస్తూ నకిలీగా ఉంది మరియు బంగారు వస్తువుల బరువును పెంచుకోవటానికి బంగారం తరహా పదార్ధాలతో నింపబడి ఉంది. అంతే కాక ఈ నకిలీ బంగారు కళాకృతులు దుకాణాల వద్ద ప్రదర్శనగా ఉంచి చట్టవిరుద్ధ పద్ధతులలో లాభాలు సంపాదించడానికి తాము అమ్మేవి పూర్తిగా బంగారు వస్తువులని వినియోగదారులను నమ్మబలికి విక్రయిస్తున్నారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దుకాణాలలో ఉపయోగించిన ప్రమాణాల యొక్క ప్రామాణికతను, అదేవిధంగా బంగారంలో పొదిగిన విలువైన రాళ్ల శాతాన్ని చట్టంలో పేర్కొన్న ఇతర కట్టుబాట్లను పరిశీలించడానికి బంగారు మార్కెట్లలో పర్యవేక్షణ పర్యటనలను మంత్రిత్వ శాఖ తీవ్రతరం చేసింది. ఆ నకిలీ నగల అమ్మకాలతో వినియోగదారులని మోసగించే ఉల్లంఘనకు పాల్పడినవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాక విలువైన ఖనిజాల ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది మరియు మార్కెట్లలో బహిర్గతమయ్యే ఆభరణాలు లేదా దేశం లోపల ఉన్న కర్మాగారాల్లో ఉత్పత్తి చేయబడుతున్న లేదా విదేశాల నుండి వచ్చే నగల అమ్మకాలపై ఇకపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







