ప్రీ లుక్‌తో ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసిన పవర్ స్టార్...
- November 23, 2017
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కొత్తసినిమాలోని ప్రీ లుక్‌తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' (వర్కింగ్ టైటిల్) ప్రీ లుక్‌తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ లుక్‌లో పవన్ అటు వైపుగా తిరిగి బ్లాక్ షేడ్‌లో కనిపిస్తున్నాడు. ఆయన ముఖం కనిపించకుండా ఇలా డిఫరెంట్ లుక్ బయటకు వదలడం స్పెషల్‌గా అనిపిస్తోంది టాలీవుడ్ ప్రేక్షకులకు. సినిమా ఫస్ట్‌లుక్ నవంబర్ 27న విడుదల చేయనున్నట్లుగా ఈ పోస్టర్లో చూపించారు. అదే రోజున సినిమా అసలు టైటిల్ కూడా ప్రకటించనున్నారు. ఈ పోస్టర్ చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఎంతో ఆకర్షణగా నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశమంతటా భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యంలోని బాణీలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 10న విడుదల చేయడానికి అంతా సిద్ధం చేస్తోంది యూనిట్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







