'సుడిగాడు' సీక్వెల్ వస్తోందా?

- November 23, 2017 , by Maagulf
'సుడిగాడు' సీక్వెల్ వస్తోందా?

తెలుగు ఇండస్ట్రీలో అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఎన్నో కామెడీ చిత్రాల్లో నటించారు. కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ల హవా తగ్గిన సమయంలో తనదైన కామెడీ టైమింగ్ తో అల్లరి నరేష్ కామెడీ హీరోగా మంచి పాపులర్ అయ్యారు. అల్లరి నరేశ్, మినిమమ్ గ్యారెంటీ హీరోగా కొనసాగుతున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి అల్లరి నరేష్ నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు. కాకపోతే ఆ మద్య 'సుడిగాడు' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేక పోతున్నాడు. దీంతో 'సుడిగాడు' సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో విజయాన్ని సాధించిన 'తమిళ పడం' సినిమాకి 'సుడిగాడు' రీమేక్. 'తమిళ పడం' సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది .. త్వరలోనే అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుడిగాడు సినిమా కి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 'సుడిగాడు' సినిమాను తెరకెక్కించిన భీమనేని శ్రీనివాసరావు, తమిళ సీక్వెల్ కి సంబంధించిన రీమేక్ రైట్స్ ను తీసుకున్నాడట. అల్లరి నరేశ్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com