డ్రాగన్: స్కైప్ వంటి విదేశీ ఆప్ లు మాకు అవసరం లేదు

- November 24, 2017 , by Maagulf
డ్రాగన్: స్కైప్ వంటి విదేశీ ఆప్ లు మాకు అవసరం లేదు

చైనా సర్కారు విదేశీ యాప్‌ల నిషేధంపై వివరణ ఇచ్చింది. విదేశీ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో తమకు మేలు జరగదని చైనా స్పష్టం చేసింది. తమ దేశ ప్రజలు తమ దేశానికి చెందిన కమ్యూనికేషన్ యాప్‌లనే వినియోగిస్తారని చైనా చెప్పింది. విదేశీ యాప్‌ల అవసరం తమకు లేదని డ్రాగన్ కంట్రీ తేల్చి చెప్పేసింది. దేశ చట్టాలకు లోబడి తమ నిర్ణయాలుంటాయని చైనా క్లారిటీ ఇచ్చేసింది. విదేశీ యాప్‌లు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని చైనా ఆవేదన వ్యక్తం చేసింది. దేశ భద్రతకు తమ ప్రజలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్న చైనా సర్కారు.. ప్రజల అవసరాల మేరకు తామే సొంతంగా యాప్‌లను రూపొందించుకోగలమని తెలిపింది. అందుకే తాము స్కైప్, యాపిల్, యూట్యూబ్ వంటి యాప్‌లపై నిషేధం విధించామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com