ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు.
- November 13, 2015
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. బ్రిటన్‌లో మోదీ పర్యటన సందర్భంగా భారత్‌లో టుస్సాడ్స్ శాఖ ఏర్పాటు అంశంపై చర్చలు జరిగాయి. 2017వ సంవత్సరాన్ని రెండు దేశాలు సాంస్కృతిక సంవత్సరంగా జరుపుకోవాలనుకుంటున్నాయి. లండన్‌లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. 2017లో జరగనున్న సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా షేక్‌స్పియర్ రచనల తొలి ముద్రణతో పాటు బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులు, మ్యాగ్నా కార్ట్స్‌ను భారత్‌కు తీసుకురానున్నారు. అదే ఏడాదిలో బ్రిటన్‌లో ఇండియా ఫెస్టివల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు డేవిడ్ కెమరూన్ తెలిపారు. 1714 నుంచి 1914 వరకు దక్షిణాసియాకు చెందిన రెండు లక్షల పేజీల చరిత్రను డిజిటైజ్ చేయాలని బ్రిటీష్ గ్రంధాలయం భావిస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







