నడి రోడ్డుపై నాట్యం చేసిన మహిళ ... మండిపడుతున్న మతపెద్దలు
- November 25, 2017
కువైట్: " నేనాడితే ...లోకమే ఆడదా " అంటూ ఓ మహిళకు ఎందుకో కొంచెం హుషారు ఎక్కువై కువైట్ లోని ఒక నడి రోడ్డుపై నాట్యం చేసింది. అయితే , లోకమైతే.. ఆమెతో ఆడలేదుగాని ఆమె డ్యాన్స్ చేస్తుండగా ఎవరో వీడియో తీశారు. అంతటితో ఆగక ఆ వీడియోబాబు ఆమె డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్పును ఎంచక్కా సోషల్మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఆ పోస్ట్ స్థానికంగా పెద్ద దుమరాన్నే రేపింది. అయితే ఆమె కావాలనే ఆ వీడియోను సోషల్ మీడియాలో తనంతట తానే పోస్టు చేసిందని మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ నడిరోడ్డుపై సిగ్గులేకుండా ఒంటరిగా డ్యాన్స్ చేయడం ఏమిటని ఇది ఇస్లాం ఆచారాలకు విరుద్ధమని ఆగ్రహిస్తున్నారు. ఆ వీడియోను చూసి మరికొంతమంది మహిళలు ప్రభావితమై అదేవిధంగా డాన్స్ చేసే ప్రమాదముందని మండిపడుతున్నారు.. పోలీసులు కూడా ఆమెపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇస్లాం ఆచారాలను ఆమె దెబ్బతీసిందని అంటున్నారు. అంతేకాకుండా ప్రజల మనోభావాలను కూడా ఆమె కించపరించిందని వారంటున్నారు. ఆ మహిళను పెట్టుకొనేందుకు పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వెనుక భాగం మాత్రమే చూపిస్తూ..నాట్యం చేయడంతో ఆమె ఎవరనేది పోలీసులు సరిపోల్చుకోలేక నానా యాతనలు చెందుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







