'చిన్న అనౌన్స్మెంట్' అంటూ పెద్ద షాక్ ఇచ్చిన నాని
- November 25, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలకే చుక్కలు చూపెడుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి ప్రస్తుతం క్రేజీ యంగ్ హీరోగా కొనసాగుతూ ఈరోజు ఎవరూ ఊహించని ప్రకటన ఇచ్చాడు.
నాని తాను నిర్మాతగా మారబోతున్నానని చెపుతూ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇవ్వడమే కాకుండా తాను తీస్తున్న సినిమా వివరాలు బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. గతంలో నాని నిర్మాతగా కొందరితో కలిసి ఒకసినిమా తీసి నష్టపోయినా ఆ నష్టాలను లెక్క చేయకుండా తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని నిర్మాతగా మారడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.
ప్రస్తుతం నాని నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించిన వివరాల వీడియోను తన ట్విటర్ లో పోస్ట్ చేసాడు. 'చిన్న అనౌన్స్మెంట్' అంటూ నాని పెద్ద షాక్ ఇచ్చాడు. 2017 మొదట్లో ప్రశాంత్ అనే వ్యక్తి నాని దగ్గరకు వచ్చి ఒక సినిమా గురించి చెప్పాడట ఆ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడట. అయితే ఆ వ్యక్తి చెప్పిన కథ విన్న నానీకి ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు సినిమా రంగంలో రాలేదు అని అనిపించిందట.
దీనితో ఆసినిమాను సపోర్ట్ చేసి తానే ఎందుకు నిర్మించ కూడదు అన్న ఆలోచన నానీకి వచ్చింది అని చెపుతున్నాడు. అంతే వెంటనే నిర్మాతగా మారి నాని ఈసినిమాను మొదలు పెట్టడమే కాకుండా ఈసినిమా నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తి అయింది అని అంటున్నాడు. ఈరోజు సాయంత్రం ఈసినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేస్తారట. ఇప్పుడు ఈ విషయాలు ఇలా బయటకు రావడంతో నానీ సామాన్యుడు కాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







