జ్ఞాపకశక్తి పెంచే ఆహార పదార్థాలు
- November 13, 2015
ఉరుకుల పరుగుల జీవితం మనిషిపై ఒత్తిడి పెంచుతోంది. కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. ఒక దగ్గర పెట్టిన వస్తువును మరొక దగ్గర వెతుకుతూ ఉంటారు. దీనికి ఒత్తిడి, ఆందోళన ప్రధాన కారణాలు. అంతేకాదు.. యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడిపోవడంతో.. ఏది గుర్తుపెట్టుకోలేరు. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకుంటున్నారా అయితే.. ఏం ఫర్వాలేదు.. ఇక్కడ చెప్పబోయే పద్ధతులు ఫాలో అవండి మంచి బెన్ఫిట్స్ పొందండి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..? అయితే ఇలా చేయండి...! నిద్రలేమి వల్ల కూడా జ్ఞాపకశక్తి చాలా తగ్గిపోతోంది. రాత్రంతా టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు ఇలా రకరకాల వ్యాపకాలతో.. లేటుగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మీకే కాదు మీ పిల్లల్లోనూ జ్ఞాపకశక్తి సమస్య ఎక్కువగా ఉంటోంది. జ్ఞాపకశక్తి పెంచే ఆహార పదార్థాలే కాదు.. కొన్ని చిన్న చిట్కాలు ఫాలో అయినా.. మంచి ఫలితాలుంటాయి. క్యారెట్స్, క్యాలీ ఫవ్లర్ ను తీసుకుంటూ ఉండాలి. 50 నుంచి 60 గ్రాముల గోబీ, కొంచెం కొత్తిమీర తీసుకుని దానిపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ కలుపుని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సో జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎక్కువ సేపు చదువుకుంటూ ఉంటారు. రాత్రి పది గంటల తర్వాత కూడా చదువుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతి అరగంటకొకసారి మంచి నీళ్లు తాగడం మంచిది. పడుకునే సమయంలో కూర్చుని చదుకుంటే మెదడుకు ఈజీగా చేరుతుంది. కానీ కొంతమంది బోర్లా పడుకుని, వంగి కూర్చుని చదువుకుంటూ ఉంటారు. ఇలా చదవడం వల్ల ప్రమాదం. నిటారుగా కూర్చుని చదివితే.. ఏకాగ్రత కుదురుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరగవుతుంది. ఎక్కువ సమయం చదువుతూ ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు రిలాక్స్ కోసం కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. నిద్ర పోగొట్టుకోవడానికి టీ, సిగరెట్టు అలవాటు చేసుకోకూడదు. డైరీ ప్రోడక్ట్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్, బట్టర్, పెరుగు మెదడు ఉత్సాహానికి తోడ్పడతాయి. ప్రత్యేకంగా పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్ మెమరీ పవర్ పెంచడానికి సహాయపడుతాయి. ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయంటే.. ఒకేసారి గంటల తరబడి కూర్చుని చదివేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఇలా చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి ఏది సరిగా గుర్తుండదు. కాబట్టి.. ఎప్పటికప్పుడు చదువుకోవడం మంచిది. లేదంటే.. చదువుకునేటప్పుడు అరగంటకోసారి విరామం ఇస్తే మైండ్ కి రిలాక్స్ గా ఉంటుంది
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







